సోంపేట మండల పరిది గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలు నుంచి 4 గంటల వరకు ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షానికి పొలాలు, కాలువలు చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్ వ్యవసాయ పనులకు మేలు చేస్తుందని రైతులు అంటున్నారు.