కవిటిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

76చూసినవారు
కవిటి మండల పరిధిలోగల పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో శనివారం రాత్రి వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి ఉక్క బోతతో అల్లాడిన జనాలకు రాత్రి కురిసిన ఈ వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ మేరకు కవిటి మండలంలోని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మడులు చదును చేసి వరి విత్తనాలు వేయుటకు ఎదురుచూస్తున్న సమయంలో ఈ వర్షం పడటం ఎంతో ఉపయోగమని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్