గ్రామీణ ప్రాంతంలో మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో పడవద్దని వెలుగు ఐ.టి.డి.ఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు మహిళలకు అవగాహన కల్పించారు. గురువారం మందస మండలంలోని కొండలోగాం , కుసుమల పంచాయతీల్లో పర్యటించారు. అనంతరం మహిళా సంఘాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.