ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో విశాఖ డైరీ పాలసేకరణ కేంద్రాన్ని బుధవారం ఎంపీటీసీ నర్తు ప్రేమ్ కుమార్ ప్రారంభించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ రోజుకి సుమారుగా 500 లీటర్ల పాలు సేకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ ఫీల్డ్ ఆఫీసర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.