ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ఇచ్చాపురంలో బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే బెందాళం అశోక్ హాజరై మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కొనియాడారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.