ఇచ్చాపురం మండలం అందెపల్లికి చెందిన ఉదయ్(25) తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉదయ్ పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడగా.. ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయ్ డెడ్ బాడీని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు.