ఇచ్చాపురం మండలం ఈదుపురానికి శుక్రవారం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అందుకు ఏర్పాట్లు అధికారులు ముమ్మరం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన ఇంచార్జ్ రాజు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి సభా ప్రాంగణాన్ని గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.