ఇచ్చాపురంలో గల రాజావారి మైదానంలో ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు కోసం శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య త ఇస్తుందని తెలిపారు. అనంతరం ఆయనను కూటమి నాయకులు సన్మానించారు. ఈకార్యక్రమంలో జనసేన ఇన్ చార్జ్ దాసరి రాజు, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.