ఇచ్చాపురం మండలంలోని కేదారిపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. అనంతరం మాలతి, భార్గవి ఉపాధ్యాయురాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ పూలే చేసిన సేవలు శిరస్సుమరణీయమని కొనియాడారు.