ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కె.నౌగాం గ్రామ పంచాయతీ లుహనియా గ్రామానికి చెందిన ఖిరాసింధు నాయక్‌ను 2 కిలోల గంజాయితో ఇచ్ఛాపురం పట్టణ ఎస్సై ముకుందరావు శుక్రవారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి ఒజ్జు నాయక్ పరిచయంతో తప్తపాణిలో శరత్ వద్ద గంజాయి కొనుగోలు చేసి, తమిళనాడుకు రవాణా చేస్తుండగా పట్టుబడ్డాడు.