తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఈ నెల 19న శ్రావణరాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే శ్రీవేంకటేశ్వర భక్తి రంజిని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్ఛాపురం సంగీత కళాకారులు చిన్నా గురుస్వామి, జయలక్ష్మి పట్నాయక్, మాస్టర్ వెంకటరావు, సుమలత తదితరులకు లభించిందని శ్రీవేంకటేశ్వర డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు చిన్నా గురుస్వామి తెలిపారు. వీరికి స్థానికులు శుక్రవారం అభినందనలు తెలిపారు.