కంచిలి మండల ప్రజలకు పోలీసులు భద్రత సూచనలు చేశారు. దొంగతనాలు చేసే ఇతర రాష్ట్ర ముఠాలు కంచిలి, తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నందున ప్రజలందరూ ఇంటి బయట, డాబాల మీద నిద్రించవద్దని, ఇండ్లలోనే తలుపులు వేసుకొని నిద్రించాలని సూచించారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో అనుమానంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.