కంచిలి మండల కేంద్రంలో గత పది రోజులుగా జరుగిన కంచమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం అర్ధరాత్రితో ముగిశాయి. చివరి రోజు వేలాది మంది భక్తులు తల్లిని దర్శించుకునేందుకు వచ్చారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ వేషధారణలతో తిరువీధులలో చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.