కంచిలి మండలంలోని జాడుపూడి కేజీబీవీ పాఠశాలలో ఎంపీడీవో తిరుమలరావు, ఏపీవో ధనుంజయ, ఎంఈవో-2 చిట్టిబాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సమయపాలన పాటించాలన్నారు.