కవిటి మండలం కేంద్రంలో కుల ధృవీకరణ పత్రాల కోసం బెంతూ ఒరియా కులస్థులు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ఆదివారం కవిటి ఆటో యూనియన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ఏడాదిగా కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించి సమస్యని పరిష్కరించాలని కోరారు.