కవిటి: పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

67చూసినవారు
కవిటి: పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
అక్రమంగా గేదెలను రవాణా చేస్తున్న వాహనం తో పాటు ముగ్గురుపై కేసు నమోదు చేశామని ఎస్సై రవివర్మ తెలిపారు. శనివారం సాయంత్రం ఒడిస్సా ప్రాంతం గొలంత్ర నుండి కోటబొమ్మాలి మండలం తిలారు నారాయణ వలస సంతకు ఆరు గేదెలను తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన వివరించారు. వాహనంలో ప్రయాణం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. అక్రమంగా పశువులు రవాణా చేస్తే చర్యలు తప్పవు అన్నారు.

సంబంధిత పోస్ట్