ఇచ్ఛాపురం పట్టణ శివారులో ఉన్న వల్లభరాయ గెడ్డ శ్మశాన వాటికను మహాప్రస్థానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి. దినేష్ కుమార్ అన్నారు. స్థానిక రోటరీ ఫంక్షన్ హాల్లో ఆదివారం మహాప్రస్థానం నిర్మాణానికి సలహాలు, సూచనలు తీసుకునేందుకు పట్టణ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3డీ ప్రాజెక్టును ప్రదర్శించారు. ప్రాజెక్టు చైర్మన్ వేదవ్యాస్, తదితరులు పాల్గొన్నారు.