కవిటి మండలం కొత్తపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు నేతాజీ( 27) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. వృద్ధురాలైన అతని తల్లి కుమారుని కోసం కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చింది. కానీ చికిత్స నిత్తం 10లక్షలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు భరించలేని సదరు కుటుంబం సహాయం కొరకు ఆర్థిస్తున్నారనే విషయం తెలుసుకున్న కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన యువతి, యువకులు మరియు గ్రామస్తులు 67600 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.