గర్భిణీలకు తప్పనిసరిగా స్కానింగ్ పరీక్షలు అవసరమని సోంపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రధాన శివాజీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్కానింగ్ తీసుకోవడం ద్వారా శిశువు ఎదుగుదల, అంగవైకల్యం, గర్భాశయ, అండంలోని లోపాలను గుర్తించవచ్చునని పేర్కొన్నారు. గర్భశయం, రొమ్ములోని గడ్డలను గుర్తించడం, వయసు పై పడ్డ మగవారిలో ప్రొటె స్టేట్ గ్రంధి వాపును గుర్తించడానికి ఉపయోగపడుతుందన్నారు.