ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన గాలి కృష్ణారావు కొద్దినెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కేదారిపురం గ్రామానికి చెందిన గల్ఫ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శుక్రవారం బాధితునికి రూ. 10 వేలు సాయం అందించారు.