ఎస్సీల ఐక్యవేదిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సి వర్గీకరణ వ్యతిరేక ర్యాలీ ఇచ్ఛాపురంలో గురువారం నిర్వహించారు. ఎస్సిల ఐక్య వేదిక పోరాట సమితి అధ్యక్షులు సెల్లా దేవరాజు, బహుజన టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నగిరి మోహనరావు ఆధ్వర్యంలో ర్యాలీ చేసారు. ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా పట్టణం, పాతబస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.