ఉపాధి హామీ పథకం ఆడిట్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న బారువా, కొర్లాం ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపీడీవో శ్యామల గురువారం సస్పెండ్ చేశారు. సోంపేట మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరి పని తీరుపై ఆడిట్ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అవకతవకలకు పాల్పడిన, పి. ధనలక్ష్మి, తామాడ మోహన్ కుమార్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సస్పెండ్ పత్రాలు అందజేశామని సోంపేట ఎపిఓ ప్రమీల తెలిపారు.