సోంపేట మండలంలో నిర్వహించిన శ్రీ మంకినమ్మ, శ్రీ పెద్దమ్మ వారు పండుగలకు సినీ ప్రముఖులకు నిర్వాహకులు ఆహ్వాన పత్రాలను అందజేశారు. వీరిలో వెంకటేష్, సుమన్ తో పాటు కేజీఎఫ్ లో విలన్ గా నటించిన గరుడకు కూడా ఆహ్వానం పంపారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు బట్టిగుల్లూరు గ్రామానికి రావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పండుగలు విజయవంతంగా కొనసాగాలని కోరారు.