సోంపేట: బెల్ట్ షాప్ లో మద్యం.. ఒకరి అరెస్టు

74చూసినవారు
సోంపేట: బెల్ట్ షాప్ లో మద్యం.. ఒకరి అరెస్టు
సోంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రుషికుద్ద గ్రామంలో బెల్ట్ షాప్ ను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులను ఎవరైనా నిర్వహిస్తే వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్ఐ లవరాజు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహించి మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దని పోలీసు వారు సూచించారు.

సంబంధిత పోస్ట్