సోంపేట సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. కంచిలి మండలం ఎంఎస్ పల్లిలో జరిపిన తనిఖీల్లో హేమరాజు 500 నాటుసారా ప్యాకెట్లను బైక్పై తరలిస్తుండగా పట్టుకున్నామని సీఐ తెలిపారు. అతని నుంచి నాటుసారా స్వాధీనం చేసుకుని బైక్ ని సీజ్ చేశామని చెప్పారు. హేమరాజుని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు విధించారని పేర్కొన్నారు.