సోంపేట మండలంలోని ఇసుకులపాలెం, గొల్లగండి, రామయ్య పట్నం గ్రామాల్లో శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బి. అశోక్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఇసుకల పాలెం, గొల్లగండి గ్రామాల్లో పూర్తయిన సీసీ రోడ్ల వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. మినీ గోకులం, కొత్త సెల్ టవర్ ను ప్రారంభించారు. జనసేన ఇన్ ఛార్జ్ దాసరి రాజు, కూటమి నాయకులు ఉన్నారు.