సోంపేట మండలం పాలవలస గ్రామంలో శుక్రవారం రైతు సేవా కేంద్రంలో స్థానిక నాయకులు విత్తనాల పంపిణీ చేశారు. రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం నాణ్యమైన నువ్వుల విత్తనాలు పలువురు రైతులకు పంపిణీ చేశారు. రైతులు కేవలం సేవా కేంద్రంలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రవీణ్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.