సోంపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బారువలో శ్రీజగన్నాథ స్వామి బాహుడ యాత్ర ఘనంగా శనివారం జరిగింది. యాత్ర సందర్భంగా నిర్వాహకులు జగన్నాథస్వామికి 56 రకాల ప్రసాదాలు, నైవేద్యం పెట్టారు. భజనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు ఫాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.