శ్రీకాకుళం: సమస్యల పరిష్కారానికి పోరాటం తప్పదు

4చూసినవారు
శ్రీకాకుళం: సమస్యల పరిష్కారానికి పోరాటం తప్పదు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట మార్గం తప్పదని భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుశీల, ఉత్తర అన్నారు. శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పాఠశాల స్వీపర్లతో సమావేశం నిర్వహించారు. కనీస వేతనం నెలకు రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన చేపట్టే ఆందోళనలో అందరూ పాల్గొనలన్నారు.

సంబంధిత పోస్ట్