జీడి పంటకు మద్దతు ధర కల్పించి, 80 కేజీల జీడిపిక్కల బస్తాను రూ. 16 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతుసంఘం జిల్లా నాయకులు కోరారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ కు శుక్రవారం వినతిపత్రం అందించారు. పలాస కేంద్రంగా జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, స్థానికంగా జీడిపిక్కల కొనుగోలు పూర్తయిన తర్వాతే విదేశీ పిక్కల దిగుమతికి అవకాశం కల్పించాలని కోరారు.