ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే. దశాబ్దాలుగా ఇవే వెతలు కొనసాగుతున్నా ప్రభుత్వాలు సరైన పరిష్కార మార్గం చూపడం లేదు. జిల్లాలో శ్రీకాకుళం తరువాత ఇచ్ఛాపురం మూడు దశాబ్దాల కిందట మునిసిపాలిటీగా అవతరించింది. ఇక్కడ 23 వార్డులు ఉండగా.. మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.