శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ మంగళవారం ఇచ్ఛాపురం బహుదానదిలో కూలిపోయిన బ్రిడ్జ్ను పరిశీలించారు. ఈ మేరకు గతంలో బ్రిడ్జ్ కూలిన తక్షణమే నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూ. 20 కోట్ల మంజూరు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో పురోగతి లేదని ఎద్దేవా చేశారు.