ఇచ్ఛాపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆదివారం కుసుంపురం సమీపంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, బలోపేతానికి చేయవలసిన కృషి కోసం చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.