నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసం, ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి సాయి కృష్ణమాచార్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఈ దళార్చన కార్యక్రమంలో భాగంగా విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.