నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయని హెచ్ఎం పైడి వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని వివరించారు. ఇటీవల కాలంలో ఇంటింటికి వెళ్లి స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని దీనికి స్పందన లభించిందని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.