నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన 13 మంది విద్యార్థులకు పూర్వ విద్యార్థులు పురస్కారాలు అందజేశారు. ఇదే పాఠశాలలో 79-80 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని టంకాల అర్జున్, రాజా రామ్మోహన్, ఆనందరావు, వెంకటరమణ తెలిపారు.