నరసన్నపేట మండల కేంద్రంలోని పలు ఆలయాలలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పలు అమ్మవారి ఆలయాలు భక్తుల తాకిడితో కితకిటలాడాయి. ఏ ఆలయాల్లో చూసిన మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలో స్థానిక శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ అర్చనలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు.