సారవకోట మండలంలోని గొర్రిబంద, నవతల ఉపాధిహామీ క్షేత్ర సహాయకులపై ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పనులకు రానప్పటికీ హాజరు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో రాంబాబు వద్ద ప్రస్తావించగా, త్వరలో అధికారులు దీనిపై విచారణ చేయనున్నట్లు చెప్పారు. అనుపురం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు రంగారావు రాజీనామా చేశారని ఎంపీడీవో తెలిపారు.