సామాజిక ఆరోగ్య కేంద్రంలో మూలకు చేరిన జనరేటర్లు

58చూసినవారు
నరసన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జనరేటర్లు నేడు పనికి రాకుండా పడి ఉన్నాయి. సంబంధిత ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయే సమయంలో జనరేటర్ వినియోగించుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇవి పనిచేయకపోవడంతో విద్యుత్ అంతరాయం వేళ రోగులతో పాటు స్థానిక సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్