సర్పంచ్ శ్రీనివాస్ మృతి బాధాకరం: ఎమ్మెల్యే బగ్గు

69చూసినవారు
టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా నిలచి పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన సర్పంచ్ శ్రీనివాసరావు మృతి బాధాకరమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పార్టీపరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న సర్పంచ్‌గా గెలుపొందారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్