నరసన్నపేట శ్రీఉష ఛాయ పద్మిని సమేత శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు మంగళవారం తరలివచ్చారు. రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ప్రధాన అర్చకులు కృష్ణ బాబు తెలిపారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదం అందజేశారు.