జిల్లాలో ఏఎస్పీలకు స్థానచలనం

54చూసినవారు
జిల్లాలో ఏఎస్పీలకు స్థానచలనం
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు అదనపు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎస్పీ ప్రేమ్ కాజల్‌కు విశాఖపట్నం సీఐడీ విభాగం ఏఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం సీఐడీ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న టి. బాబు శ్రీకాకుళం అడ్మిన్ ఏఎస్పీగా నియమితులయ్యారు. విజిలెన్స్ ఏఎస్పీ ఎ. సురేష్ బాబు, ఎస్ఈబీ ఏఎస్పీ డి. గంగాధరాన్ని ప్రధాన కార్యాలయానికి పంపారు.

సంబంధిత పోస్ట్