నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎం ఎల్ ఎస్. గోదామును జిల్లా మేనేజర్ టి వేణుగోపాల్ ఆకస్మికంగా పరిశీలించారు. మంగళవారం సాయంత్రం గోదాంలో ఉన్న నిల్వలను తనిఖీ చేసి ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రం ఆధ్వర్యంలో నరసన్నపేట, జలుమూరు మండలాలకు 179 పాఠశాలలకు 25 కేజీల బ్యాగులు 1417 వచ్చాయని డీటీ సంధ్య తెలిపారు. వీటిని ఆయా పాఠశాలలకు తరలిస్తున్నామన్నారు.