నరసన్నపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

59చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో పథకాన్ని మొదలుపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నిరుపేద విద్యార్థులకు ఇది ఒక వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్