నరసన్నపేట పంచాయతీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో పొగతో స్థానికులు ఇబ్బందులకు గురి అయ్యారు. గతంలో మూడుసార్లు ఇదే పరిస్థితి నెలకొందని.. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. సమాచారం అందుకున్న ఈవో ద్రాక్షాయిని సిబ్బందిని అప్రమత్తం చేసి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. దీనిపై దృష్టి సారిస్తామన్నారు.