నరసన్నపేటలో సత్యసాయి సేవా సంస్థల ఉచిత కంప్యూటర్ శిక్షణ

66చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పెద్ద సత్య సాయి మందిరంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. గురువారం ఆయన కంప్యూటర్ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సేవా సంస్థల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్