శ్రీకాకుళం నుండి నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం మరియు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్ళవలసిన బస్సులు అన్ని ఆదివారం నుంచి శ్రీకాకుళం వయా రామలక్ష్మణల జంక్షన్ మీదగా పెద్దపాడు చేరుకుంటాయని శ్రీకాకుళం రవాణా శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సులు పెద్దపాడు, రాగాలు జంక్షన్ మీదగా శ్రీకాకుళం చేరుకుంటాయని వెల్లడించారు. ప్రయాణికులు దీన్ని గమనించాలని చెప్పారు.