ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 23వ తేదీన పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు, ఏపీఓ కే యుగంధర్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. 23న జరిగే గ్రామసభలో ఆయా గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులను గుర్తించాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాటిని పూర్తి చేస్తామన్నారు.