జలుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి తిరువీధి శుక్రవారం రాత్రి దేవాదాయశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ఆలయ పేరున ధర్మకర్త అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో ఊరేగింపు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.