నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్ర దీపాలంకరణ స్వామివారికి చేపట్టారు. శుక్రవారం రాత్రి స్థానిక ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొని దీపాల నడుమ ఉన్న స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.